నవ్వును కొనుక్కోవాల్సి వస్తున్నది..

Sun,February 18, 2018 05:54 PM
నవ్వును కొనుక్కోవాల్సి వస్తున్నది..


హైదరాబాద్ : నవ్వు అనేది సహజసిద్ధంగా మనిషి వచ్చే ఒక అపూర్వమైన అలవాటు, ప్రక్రియ అని అన్నాడు టాలీవుడ్ కమెడియన్, హీరో శ్రీనివాస్ రెడ్డి. ఈ యాక్టర్ మన జీవితంలో నవ్వు ఎంత ప్రాధాన్యమైందో చెప్పాడు. నవ్వు మనిషి సంతోషంగా ఉండడానికి దోహదం చేస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. నవ్వును కొనుక్కోవాల్సి వస్తుంది. సినిమాలు, కామెడీ షోలు, లాఫింగ్ క్లబ్బులకు డబ్బు చెల్లించి నవ్వవలసి వస్తున్నది. నవ్వు అలా కొనుక్కోవాల్సిన వస్తువు కాదు. హాస్యాన్ని పట్టించుకోకుండా అపహాస్యం చేశారు. ఇప్పుడా నవ్వే ఆరోగ్యానికి మూలకారణం అని తెలిసి అందరూ మళ్లీ నవ్వు కోసం వెంపర్లాడుతున్నారు. నవ్వు చాలా విలువైనది. అది అందరికీ అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉంటుంది. కాకపోతే దాన్ని గుర్తించలేక కొనుక్కుంటున్నారు. ఒక హాస్యనటుడిగా.. అందరూ నవ్వుతూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

2274

More News

VIRAL NEWS