ఇస్లాం మ‌తం పుచ్చుకున్న ప్ర‌ముఖ హీరో సోద‌రుడు

Sun,February 17, 2019 07:30 AM
Actor Simbus brother Kuralarasan converts to Islam

సినిమా ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే ఏఆర్ రెహ‌మాన్, యువ‌న్ శంక‌ర్ రాజా వంటి ప్ర‌ముఖులు ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించ‌గా ఇప్పుడు వారి జాబితాలో కోలీవుడ్ హీరో శింబు సోద‌రుడు కుర‌ళ‌ర‌స‌న్ చేరాడు. బాల న‌టుడిగా ప‌లు చిత్రాల‌లో న‌టించిన కుర‌ళ‌ర‌స‌న్ ‘ఇదునమ్మ ఆలు’ చిత్రంతో సంగీతదర్శకుడిగా మారారు. అయితే ఓ ముస్లిం యువ‌తిని ప్రేమిస్తున్న కార‌ణంగానే కుర‌ళ‌ర‌స‌న్ ఇస్లాం మ‌తంలోకి మారాడ‌ని కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతుంది. చెన్నై, అన్నాశాలైలోని మక్కా మసీదులోని ముస్లిం మత గురువుల సమక్షంలో ఇస్లాం మ‌తం స్వీక‌రించ‌గా ఈ కార్య‌క్ర‌మానికి కురళరసన్‌ తల్లిదండ్రులు టీ.రాజేందర్, ఉషా హాజయ్యారు. చిన్నత‌నంలోనే కుర‌ళ‌ర‌స‌న్ ఇస్లాం మ‌తం వైపు ఆక‌ర్షితుడ‌య్యాడ‌ని, అన్ని మ‌తాలు ఒకటే అనే భావ‌న నాలో ఉండ‌డంతో త‌న త‌న‌యుడి ఇష్టాన్ని గౌర‌వించాన‌ని టి. రాజేంద‌ర్ అన్నారు. రాజేంద‌ర్ కుటుంబంలో శింబు శివ భక్తుడు కాగా, రాజేంద‌ర్ కూతురు ఇల‌ఖ్య ఇటీవ‌ల క్రైస్త‌వ మ‌తంలోకి మారి వివాహం చేసుకుంది. ఇప్పుడు కుర‌ళ‌ర‌స‌న్ ఇస్లాం మ‌తంలోకి మారాడు. అయితే త‌మిళ సినిమా ఇండ‌స్ట్రీ నుండి మ‌తం మార్చుకొని ఇస్లాం మ‌తంలోకి వెళ్లిన తొలి వ్య‌క్తి కుర‌ళ‌ర‌స‌న్ కావ‌డం విశేషం.

7077
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles