హీరో కిడ్నాప్‌.. షాక్‌లో అభిమానులు..!

Sun,February 17, 2019 06:58 AM
actor saravanakumar kidnapped and released

‘పట్టదారి’, ‘కేరళనాటిన్‌ పెంగళుడన్‌’ తదితర సినిమాల‌లో హీరోగా న‌టించిన త‌మిళ హీరో శ‌ర‌వ‌ణ‌కుమార్ (32) కిడ్నాప్ కావ‌డం అభిమానుల‌ని క‌ల‌వ‌ర‌ప‌ర‌చింది. ప‌ట్ట‌దారి చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన అతిథి మీన‌న్‌ని శ‌ర‌ణ‌కుమార్ వివాహం చేసుకోగా, మూడు నెలల క్రితం వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చిన విభేదాల వ‌ల‌న విడిపోయారు. ప్ర‌స్తుతం సింగిల్‌గా ఉంటున్నాడు. అయితే గురువారం రాత్రి త‌న కుమారుడిని ముగ్గురు వ్య‌క్తులు కారులో కిడ్నాప్ చేశారంటూ ఆయ‌న తండ్రి రాజేంద్ర పాండియ‌న్ పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు శ‌ర‌వ‌ణ‌కుమార్ కోసం అన్వేషిస్తున్న నేప‌థ్యంలో శుక్ర‌వారం ఉద‌యం ఇంటికి చేరుకున్నాడు. సుజిత్‌, ద‌ర్శ‌న్‌, అరుణ్ కుమార్ అనే ముగ్గురు వ్య‌క్తులు న‌గదు కోసం కిడ్నాప్ చేసార‌ని శ‌ర‌వ‌ణ పోలీసులకి చెప్ప‌డంతో వారు విచార‌ణ చేప‌ట్టారు.

6129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles