కమెడీయన్ కి ఆరు నెలల జైలు శిక్ష

Tue,April 24, 2018 05:18 PM
Actor Rajpal Yadav sentenced to 6 months jail

హిందీలోనే కాక పలు తెలుగు చిత్రాలలో నటించిన కమెడీయన్ రాజ్ పాల్ యాదవ్. రాజ్ పాల్ బాలీవుడ్ లో ‘భూల్ భూలయ్యా’, ‘పార్టనర్’, ‘హంగామా’ లాంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన ‘కిక్ -2’ సినిమాలోనూ నటించాడు. వ్యాపారవేత్త దగ్గర నుండి అప్పు తీసుకొని చెల్లించని క్రమంలో రాజ్ పాల్ కి ఆరు నెలల జైలు శిక్ష విధించింది ఢిల్లీ కోర్టు.

రాజ్ పాల్ 2010లో వచ్చిన ఆట పాట లాపాట సినిమా కోసం ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఎమ్ జీ అగర్వాల్ దగ్గర నుండి 5 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ సినిమాలో తానే నటించి దర్శకత్వం వహించాలనుకున్నాడు. తీసుకున్న మొత్తంతో పాటు వడ్డీ అంతా 2011 డిసెంబర్ 3 నాటికి తిరిగి ఇచ్చేస్తానని మాట కూడా ఇచ్చాడట. ఆ సినిమా మధ్య లోనే ఆగిపోవడంతో తీసుకున్న మొత్తం సకాలంలో చెల్లించలేకపోయాడు. దీంతో అగర్వాల్ కోర్టులో కేసు వేశాడు.

రాజ్ పాల్ యాదవ్ కేసుని విచారించిన కోర్టు పలు మార్లు ఆయనకి చెల్లించే అవకాశం కలిపించింది. కాని దానిని ఆయన ఉపయోగించుకోలేకపోయాడు. దీంతో కోర్టు ఈయనకి ఆరు నెలల జైలు శిక్షతో పాటు 11.2 కోట్ల జరినామా విధించింది. అంతేకాదు రాజ్ పాల్ భార్య రాధ యాదవ్ కి కూడా 70లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు అనంతరం రాజ్ పాల్ 50,000 వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ పై బయటకి వచ్చారు.

6146
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles