షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ హీరో నాని..!

Wed,January 30, 2019 10:11 AM

ప్ర‌తి సినిమాలోను ఎంతో నేచుర‌ల్‌గా న‌టించే నాని కెరీర్‌లో తొలిసారి క్రీడా నేప‌థ్యం గ‌ల చిత్రం చేస్తున్నాడు. మ‌ళ్లీ రావా ఫేం గౌత‌మ్ తిన్న‌మూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది . ఇటీవల చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ కూడా విడుద‌ల కాగా ఇందులో నాని క్రికెట‌ర్‌గా అద‌ర‌గొట్టాడు. జెర్సీ చిత్రం పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది .అర్జున్ పాత్రలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం క్రికెట్‌లో శిక్ష‌ణ తీసుకున్న నాని త‌న పాత్ర‌కి ప‌క్కా న్యాయం చేయాల‌ని మొద‌టి నుండి చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. అయితే తాజాగా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో క్రికెట్‌ బాల్‌ నాని ముఖానికి తగలటంతో ముక్కుకు, చెంపకు బ‌ల‌మైన గాయమైందట‌. దీంతో నానికి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించిన‌ట్టు స‌మాచారం. జెర్సీ చిత్రంలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, చిత్రానికి అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. నాని ఈ చిత్రం త‌ర్వాత విక్రమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

3453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles