లీకైతే ఏమైంది.. ఇదిగో ఒరిజిన‌ల్.. వైర‌ల్ ఫోటో పై నాగ్!

Fri,August 18, 2017 11:30 PM
Actor Nagarjuna response on akhil movie still leak

అఖిల్.. అంటూ త‌న మొద‌టి మూవీతో అల‌రించిన అక్కినేని అఖిల్ ఇప్పుడు 'మ‌నం' మూవీ ఫేం విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌కత్వంలో న‌టిస్తున్నాడు. అన్న‌పూర్ణ స్టూడియోస్, మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకం పై నాగార్జ‌న ఈ మూవీని నిర్మిస్తున్నాడు. అఖిల్ కు జోడుగా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని ఈ మూవీలో హీరోయిన్ గా న‌టిస్తున్న‌ది. అయితే.. ఈ మూవీ కి సంబంధించిన ఓ స్టిల్ ఇప్పుడు ఆన్ లైన్ లో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. అఖిల్ ఫైట్ చేస్తుండ‌గా.. హీరోయిన్ అత‌డిని ప‌ట్టుకొని ఉన్న సీన్. వెన‌క చాలా మంది రౌడీలు కూడా ఉంటారు. ఆన్ లైన్ లో లీకైన ఈ స్టిల్ పై స్పందించిన నాగ్... "లీకైతే ఏమైంది. ఒరిజిన‌ల్ ఫోటో ఇదే. దీని క‌న్నా పెద్ద‌దైన‌, మెరుగైన ఫోటో ను ఆగ‌స్టు 21 న రిలీజ్ చేస్తాం. దానికి సంబంధించిన క్లూ ను రేపు ఇస్తా" అంటూ ట్వీట్ చేశాడు నాగార్జున‌.


5187
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles