రక్షా బంధన్ రోజు రాఖీతో పాటు హెల్మెట్ కూడా గిఫ్ట్‌గా ఇవ్వండి: మహేశ్

Thu,August 9, 2018 09:26 PM
Actor mahesh babu supports sister for change campaign initiated by mp kavitha

హైదరాబాద్: ఎంపీ కవిత ప్రారంభించిన సిస్టర్స్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సిస్టర్స్ ఫర్ చేంజ్‌కు మద్దతు తెలిపారు. మహేశ్ తన మద్దతు తెలుపుతూ ఓ వీడియోను రూపొందించారు. ఆ వీడియోను ఎంపీ కవిత తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

"దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 28 మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే చనిపోతున్నారు. 28 కుటుంబాలు వాళ్లను ప్రేమించే మనుషులను కోల్పోతున్నారు. జస్ట్ ఒక చిన్న కేర్‌లెస్‌నెస్ వల్ల. ఇట్స్ టైమ్ ఫర్ ఏ చేంజ్. రక్షా బంధన్ రోజు అన్నదమ్ములకు రాఖీతోపాటు హెల్మెట్ బహుమతిగా ఇవ్వండి. వాళ్లను తప్పకుండా పెట్టుకోమని చెప్పండి.." అంటూ మహేశ్ ఆ వీడియోలో వివరించాడు. ఇక.. తన బర్త్‌డే రోజు చొరవ తీసుకొని సిస్టర్స్ ఫర్ చేంజ్‌కు మద్దతు తెలపడంతో మహేశ్‌బాబుకు ఎంపీ కవిత ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు.


3544
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles