బీజేపీలో చేరిన బాలీవుడ్ హీరోయిన్..

Sun,January 27, 2019 06:20 PM

ముంబై: బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఇషా కొప్పికర్ కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బీజేపీ కండువా అందించి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కంపెనీ చిత్రంలో ప్రత్యేక గీతం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇషా. ఈ నటి హిందీతోపాటు తెలుగు, కన్నడ, మరాఠీ చిత్రాల్లో నటించింది. తెలుగులో ప్రేమతోరా, చంద్రలేఖ, కేశవ చిత్రాల్లో నటించింది.

2476
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles