టాక్సీ డ్రైవర్‌గా అనిల్‌ కపూర్‌.. 'అచ్చే దిన్‌' సాంగ్‌ అదుర్స్‌

Fri,July 20, 2018 05:05 PM
Achche Din Song from FANNEY KHAN movie featured anil kapoor

బాలీవుడ్ స్టార్లు అనిల్ కపూర్, ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'ఫన్నేఖాన్'. అతుల్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజ్‌కుమార్‌రావు కీలక పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ సినిమా అభిమానులను బాగానే ఆకట్టుకున్నది. తర్వాత ఈ మూవీ పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఆగస్ట్ 3న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ జ‌రుగుతుంది. దీంతో ఇవాళ 'అచ్చే దిన్‌' అనే సాంగ్‌ను మూవీ యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ సాంగ్‌లో అనిల్‌ కపూర్‌ టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తాడు.

అనిల్‌కపూర్ గాయకుడు అవ్వాలన్న తన చిరకాల కోరికను తన కూతురు ద్వారా తీర్చుకోవాలనుకుంటాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా గాయకుడు కాలేని అనిల్‌కపూర్ తన స్నేహితుడు (రాజ్‌కుమార్‌రావు ) సాయంతో పాప్ స్టార్ ఐశ్వర్యారాయ్‌ను కిడ్నాప్ చేస్తాడు. అనిల్ కపూర్ తన కలను ఎలా నెరవేర్చుకున్నాడన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

1406
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles