HomeLATEST NEWSAchari America Yatra song teaser released

స్వామిరారా సాంగ్ తో వచ్చేసిన ఆచారి

Published: Fri,January 12, 2018 05:07 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం వంటి హిట్ చిత్రాలని తెలుగు ప్రేక్షకులకి అందించిన మంచు విష్ణు - జి. నాగేశ్వర రెడ్డి కాంబినేషన్ ఇప్పుడు హ్యట్రిక్ పై కన్నేసింది. పద్మజ పిక్చర్స్ బేనర్ పై కీర్తి చౌదరి నిర్మాణంలో ఆచారి అమెరికా యాత్ర చేస్తుంది ఈ కాంబో. జనవరి 26న మూవీ విడుదల కి ప్లాన్ చేయగా, టీజర్స్ , పోస్టర్స్ తో సినిమాపై భారీ హైప్స్ పెంచుతుంది టీం. ఈ మధ్య టీజర్ విడుదల చేసిన ఆచారి అమెరికా యాత్ర యూనిట్ తాజాగా స్వామి రారా వీడియో సాంగ్ ని విడుదల చేశారు. థమన్ సంగీతంలో రూపొందిన ఈ సాంగ్ సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తుంది. ఈ చిత్రంలో బ్రహ్మనందం ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఢీ చిత్రంలో విష్ణు, బ్రహ్మీ మధ్య సంభాషణలకు ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇప్పుడు ఆచారి అమెరికా యాత్రలోను మరోసారి ఈ కామెడీని రిపీట్ చేయనున్నట్టు సమాచారం. ప్రగ్యా జైస్వాల్ ఇందులో కథానాయికగా నటిస్తుంది. ఈ రోజు ప్రగ్యా బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే.

1612
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology