నిందితులు ఆరోపణలపై స్పందించాలి..

Fri,October 12, 2018 04:05 PM
Accused must should be respond kamalhasan on me too campaign

చెన్నై: ప్రస్తుతం మీ టూ ఉద్యమం రోజురోజుకీ తారాస్థాయికి చేరుతున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఒక్కోటిగా బయటపెడుతున్నారు. తనుశ్రీ దత్తా, ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనే, సుస్మితాసేన్, సోనంకపూర్, చిన్మయి శ్రీపాద ఇంకా చాలా మంది హీరోయిన్లు వేధింపుల విషయాన్ని చెప్పారు. నానా పటేకర్‌పై ఆరోపణలు చేసిన తనుశ్రీ కూడా బాలీవుడ్ హీరోలు అనిల్‌కపూర్, అక్షయ్‌కుమార్, ఇమ్రాన్‌హష్మీ మద్దతు కూడా ప్రకటించారు. తాజాగా హౌస్‌ఫుల్ 4 డైరెక్టర్ సాజిద్‌ఖాన్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో అక్షయ్‌కుమార్ ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

మీ టూ ఉద్యమంపై ప్రముఖ నటుడు, మక్కల్ నీథి మయ్యమ్ పార్టీ అధినేత కమల్‌హాసన్ స్పందించారు. ముందుగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో..వారే ఖచ్చితంగా స్పందించి సమాధానమివ్వాలి. అంతేకానీ ఈ అంశంపై అందరూ మాట్లాడితే సరైంది కాదు..దాని వల్ల ప్రయోజనం ఉండదన్నారు. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వారు వాస్తవమైన ఆరోపణలు చేస్తే..వారికి ఎలాంటి హాని కలగదని చెప్పారు కమల్‌హాసన్. ఇప్పటికే అలోక్‌నాథ్, వైరముత్తు, కైలాశ్‌కేర్, రజత్‌కపూర్, వికాస్‌బాల్ పై లైంగిక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

1070
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS