అబుదాబిలోను సాహోకి ఫుల్ క్రేజ్‌

Thu,May 3, 2018 08:18 AM
abu dhabi media shows interest on saaho

బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌పంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం యూవీ క్రియేష‌న్స్ బేన‌ర్‌పై సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో సినిమా చేస్తున్నాడు. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతున్న‌ట్టు తెలుస్తుంది. కేవ‌లం యాక్ష‌న్ ఎపిసోడ్స్‌కే దాదాపు 90 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు పెడుతున్నార‌ట . ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: గోస్ట్‌ ప్రోటోకాల్, ట్రాన్స్‌ఫార్మర్స్‌: డార్క్‌ మూన్‌’ వంటి హాలీవుడ్‌ సినిమాలకు యాక్షన్‌ కొరియోగ్రఫీ చేసిన కెన్నీ బేట్స్‌ ఈ సినిమాకి యాక్షన్‌ సీన్స్‌ డిజైన్‌ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ అబుదాబిలో జ‌రుగుతుంది. 60 రోజుల పాటు 250 మంది స‌భ్యుల‌తో కంటిన్యూ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది ఈ చిత్రం. టైగ‌ర్ జిందా హై త‌ర్వాత అబుదాబిలో ఎక్కువ రోజులు షెడ్యూల్ జ‌రుపుకుంటున్న చిత్రం సాహో కాగా, ఈ మూవీపై అక్క‌డి ప్ర‌జ‌లే కాక మీడియా కూడా ఇంట్రెస్ట్ పెడుతుంది. రీసెంట్‌గా ప్ర‌భాస్‌, కెన్నీ బేట్స్‌ని అక్క‌డి మీడియా ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇంట‌ర్వ్యూకి సంబంధించిన స్టిల్స్‌తో పాటు యాక్ష‌న్ ఎపిసోడ్స్ కి సంబంధించిన స్టిల్స్ కూడా సోష‌ల్ మీడియాలో తెగ చక్క‌ర్లు కొడుతున్నాయి. తెలుగుతో పాటు హిందీలోను విడుదల కానున్న ఈ చిత్రంలో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు. శ్ర‌ద్ధా క‌పూర్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

1422
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles