శ‌ని, ఆది వారాల‌లో మ‌హాన‌టి చిత్రం ఉచితంగా చూసే ఛాన్స్

Thu,May 24, 2018 08:45 AM
above 55 years free screening for mahanati

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సావిత్రి జీవిత నేప‌థ్యంతో తెర‌కెక్కిన బ‌యోపిక్ మ‌హాన‌టి. తెలుగులో తొలి బ‌యోపిక్‌గా రూపొందిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు సాధిస్తుంది. ఓవ‌ర్సీస్‌లోను ఈ మూవీ స్టార్ హీరోల సినిమా రేంజ్‌లో క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంది. చిన్న , పెద్ద అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు ఈ సినిమాని ఆద‌రిస్తున్నారు. ముఖ్యంగా సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్ అభిన‌యం కోసం ఒక్క‌సారైన సినిమా చూడాల‌ని సినీ ల‌వ‌ర్స్ కోరుకుంటున్నారు. అయితే మ‌హాన‌టిలో సావిత్రి జీవితాన్ని క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించ‌డంతో ఆ త‌రం వారు మ‌హాన‌టి మూవీ చూసేందుకు థియేట‌ర్స్ ద‌గ్గ‌ర క్యూ క‌డుతున్నారు.

50 ఏళ్ళ‌కి పైబ‌డిన వ‌య‌స్సు వారు కూడా మండే ఎండ‌ల‌లో ఈ సినిమా చూసేందుకు థియేట‌ర్స్ ద‌గ్గ‌ర క్యూ క‌డుతున్నారు. అయితే ఈ విష‌యం తెలుసుకున్న వైజ‌యంతి మూవీస్ వారు 55 ఏళ్ల వయసు పైబడినవారికి శనివారం, ఆదివారం ‘మహానటి’ టిక్కెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. పెద్దల్ని గౌరవిస్తూ ఈ సౌక‌ర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. అమెరికాలోని కొన్ని లొకేషన్లకు మాత్రమే ఆఫర్‌ వర్తిస్తుందంటూ పోస్టర్‌లో తెలిపింది. మ‌రోవైపు వృద్ధాశ్రమాల్లో మ‌హాన‌టి చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది మ‌హాన‌టి టీం. జూన్ మూడో వారం మ‌హాన‌టి మీ ద‌గ్గ‌రికే వ‌స్తుంది. త‌న త‌రం వారి ద‌గ్గ‌ర‌కి త‌ర‌లి వ‌స్తుంది . ఓల్డేజ్ హోమ్‌లో మ‌హాన‌టి చూస్తూ సంబ‌రాలు చేసుకోండి . ఇందుకు చేయ‌వ‌ల‌సింది మీ వివ‌రాలు [email protected]కు వివరాలు పంపండి’ అంటూ ఇటీవ‌ల ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

6054
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles