విదేశాల‌లో హీరోయిన్ త‌న‌యుడి మూవీ షూటింగ్

Sat,September 8, 2018 11:55 AM
Abhishek movie shooting in foreign

శాండల్‌వుడ్ రెబల్ స్టార్ అంబరీశ్, ఆయన భార్య సుమలతల త‌న‌యుడు అభిషేక్ త్వ‌ర‌లోనే వెండితెర ఆరంగేట్రం చేయ‌నున్నాడని అప్ప‌ట్లో ప‌లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. త‌ల్లి తండ్రులు ఇద్ద‌రు న‌టులు కావ‌డంతో అభిషేక్‌ కూడా యాక్టింగ్ వైపు ఎక్కువ‌గా ఇంట్రెస్ట్ చూపుతున్నాడ‌ని, యాక్టింగ్‌తో పాటు మార్ష‌ల్ ఆర్ట్స్‌లోను ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ని కూడా అన్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం అభిషేక్ డెబ్యూ చిత్రం అమ‌ర్ చిత్రీక‌ర‌ణ చురుగ్గా సాగుతోంది. 50 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ మూవీ త‌ర్వాతి షెడ్యూల్‌ని జైపూర్‌లో ఐదు రోజుల పాటు ప్లాన్ చేశారు. ఇది పూర్తైన త‌ర్వాత విదేశాల‌లో చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని అన్నారు.

నాగ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న అమ‌ర్ అనే చిత్రాన్ని సందేశ్ నాగ్ రాజ్ నిర్మిస్తుంది. క‌థానాయిక‌గా తాన్యా హోప్ న‌టిస్తుంది . భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రంలో చిక్కణ్ణ, సుధారాణి, దీపక్‌శెట్టి, సాధుకోకిలా ప్ర‌ధాన తారాగ‌ణంగా ఉన్నారు. ఈ చిత్రం ఇప్పటికే మడికెరి, మంగళూరు, మణిపాల్‌, బెంగళూరు, ఊటీ, మైసూరుతో పాటు కేరళలో షూటింగ్ జ‌రుపుకుంది. కన్న‌డ చిత్ర సీమ‌లో త‌మ కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న అంబ‌రీశ్‌, సుమ‌ల‌త‌లా అభిషేక్ కూడా మంచి పేరు తెచ్చుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట‌. సుమ‌ల‌త ఖైదీ, చట్టంతో పోరాటం, శృతి లయలు లాంటి చిత్రాలలో హీరోయిన్‌గా అలరించగా ఆ తర్వాత రాజ కుమారుడు, శ్రీ మంజునాథ చిత్రాలలో ముఖ్యమైన పాత్రలలో నటించింది. ప్ర‌స్తుతం స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ కూడా చేస్తుంది. బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ని కూడా అల‌రిస్తుంది.

4074
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles