వెండితెర ఆరంగేట్రం చేయ‌నున్న అల‌నాటి హీరోయిన్ త‌న‌యుడు

Tue,May 29, 2018 12:39 PM
abhishek debut to kannada industry

శాండల్‌వుడ్ రెబల్ స్టార్ అంబరీశ్, ఆయన భార్య సుమలతల త‌న‌యుడు అభిషేక్ త్వ‌ర‌లోనే వెండితెర ఆరంగేట్రం చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే అన్ని ఇండ‌స్ట్రీల‌లో వార‌సుల హ‌వా కొన‌సాగుతుండ‌గా, నిన్న‌టి త‌రం న‌టి సుమ‌ల‌త త‌న‌యుడు అభి కూడా సినీ ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ట‌. త‌ల్లి తండ్రులు ఇద్ద‌రు న‌టులు కావ‌డంతో అభిషేక్‌ కూడా యాక్టింగ్ వైపు ఎక్కువ‌గా ఇంట్రెస్ట్ చూపుతున్నాడ‌ట‌. యాక్టింగ్‌తో పాటు మార్ష‌ల్ ఆర్ట్స్‌లోను ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటున్న అభిషేక్ అమ‌ర్ అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. నాగ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని సందేశ్ నాగ్ రాజ్ నిర్మిస్తుంది. క‌థానాయిక‌గా తాన్యా హోప్‌ని ఎంపిక చేసార‌ట‌. భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి కన్న‌డ చిత్ర సీమ‌లో త‌మ కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న అంబ‌రీశ్‌, సుమ‌ల‌త‌లా అభిషేక్ కూడా మంచి పేరు తెచ్చుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట‌. సుమ‌ల‌త ఖైదీ, చట్టంతో పోరాటం, శృతి లయలు లాంటి చిత్రాలలో హీరోయిన్‌గా అలరించగా ఆ తర్వాత రాజ కుమారుడు, శ్రీ మంజునాథ చిత్రాలలో ముఖ్యమైన పాత్రలలో నటించింది. ప్ర‌స్తుతం స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ కూడా చేస్తుంది. బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ని కూడా అల‌రిస్తుంది.

5755
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles