మ‌రోసారి అభిషేక్‌కి చీవాట్లు పెట్టిన నెటిజ‌న్స్‌

Thu,August 9, 2018 10:09 AM
Abhishek Bachchan once again trolled about his behaviour

ఈ మ‌ధ్య కాలంలో అభిషేక్ బ‌చ్చ‌న్ నెటిజ‌న్స్‌చే విప‌రీతంగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. ఒక‌సారి త‌న సినిమాల వ‌ల‌న మాట‌లు ప‌డ్డ అభిషేక్ అమితాబ్ తో క‌లిసి ఉండ‌డం, త‌న కూతురి స్కూల్ మాన్పించి విహార యాత్ర‌ల‌కి తీసుకెళ్ల‌డం, త‌న‌కి అంద‌మైన భార్య దొర‌క‌డం వంటి విష‌యాల‌లో ట్రోల్ కాబ‌డ్డాడు. తాజాగా అభిషేక్ నెటిజ‌న్స్‌కి అడ్డంగా దొర‌కిపోవ‌డంతో ఆయ‌న‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కుపెట్టారు నెటిజ‌న్స్‌. రీసెంట్ గా ఎస్కార్ట్స్‌ గ్రూప్‌ చైర్మన్‌, అమితాబ్‌ బచ్చన్‌ వియ్యంకుడు రాజన్‌ నందా గుర్గావ్‌ ఆసుపత్రిలో క‌న్ను మూశారు. రాజన్‌ నందా, అమితాబ్‌ బచ్చన్‌ కూతురు శ్వేత బచ్చన్‌ నందాకు మామయ్య. రాజన్‌ నందా కొడుకు నికిల్‌ నందాను శ్వేతా పెళ్లి చేసుకున్నారు. రాజన్‌ నందా చనిపోయినట్టు తెలియగానే బ్రహ్మాస్త్ర షూటింగ్‌లో భాగంగా బల్గేరియాలో ఉన్న అమితాబ్‌ బచ్చన్‌ భారత్‌కు వ‌చ్చేశారు. అయితే రాజ‌న్ నందా అంత్య‌క్రియ‌లు ముగిసిన త‌ర్వాత కుటుంబ స‌భ్యులు సంస్మ‌ర‌ణ స‌భని బుధ‌వారం నిర్వ‌హించారు. అమితాబ్, జ‌యాబ‌చ్చ‌న్‌, శ్వేతా, అభిషేక్ బ‌చ్చ‌న్ త‌దిత‌రులు సంస్మ‌ర‌ణ స‌భ‌లో పాల్గొన్నారు. ఈ స‌భ‌కి సంబంధించిన ఓ వీడియోలో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఇందులో అభిషేక్ న‌వ్వుతూ క‌నిపించాడు. దీంతో జూనియ‌ర్ బ‌చ్చ‌న్‌పై నెటిజ‌న్స్ విరుచుకుప‌డ్డారు. ఎక్క‌డ ఎలా ఉండాలో తెలీదా అంటూ క్లాసులు పీకారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన రియాక్ష‌న్స్‌పై మీరు ఓ లుక్కేయండి.1799
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles