వ్యంగ్యంగా మాట్లాడిన‌వారికి అభిషేక్ దిమ్మ తిరిగే స‌మాధానం

Thu,April 19, 2018 09:41 AM
Abhishek Bachchan gives befitting reply to trolling man

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్ ‘మన్‌మర్జాయన్‌’ ప్రాజెక్ట్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రెండేళ్ళు వెండితెర‌కు దూరంగా ఉన్న అభిషేక్ ప్ర‌స్తుతం మ‌ళ్ళీ కెరీర్‌పై దృష్టి పెట్టాడు. అయితే సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే అభిషేక్ బ‌చ్చ‌న్‌కి ఓ నెటిజ‌న్ వెరైటీ ట్వీట్ చేశాడు. మీ జీవితం గురించి ఏ మాత్రం బాధ లేదా, ఇంత వ‌య‌స్సొచ్చినా త‌ల్లితండ్రుల‌తో క‌లిసి ఎలా ఉంటున్నావు అని ఓ నెటిజ‌న్ త‌న ట్వీట్ ద్వారా తెలిపాడు. దీనికి స్పందించిన అభిషేక్‌. అవును నా త‌ల్లితండ్రుల‌తో క‌లిసి ఉండ‌డం చాలా గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం. నాకు వారితో పాటు ఉండే అవ‌కాశం క‌లిగింది. నువ్వు అలా ట్రై చేసి చూడు. అప్పుడైన నిన్నునువ్వు మంచిగా భావించుకునే అవకాశం క‌లుగుతుందంటూ నెటిజ‌న్‌కి దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చాడు అభిషేక్. ఈ కామెంట్‌పై నెటిజ‌న్స్ ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అనురాగ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ చేస్తున్న ‘మన్‌మర్జాయన్‌’ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది . ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్కీ కౌశాల్‌, తాప్సీ ప‌న్ను ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. చిత్రంలో పంజాబీ వ్య‌క్తిగా అభిషేక్ కనిపించ‌నుండ‌గా, తాప్సీ, విక్కీలు కూల్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం విడుద‌ల కానుంది.

2641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS