ఐశ్వ‌ర్య‌రాయ్, అభిషేక్‌లు గొడ‌వ‌ప‌డ్డారా?

Tue,July 24, 2018 01:38 PM
Abhishek Bachchan Calls Out False Story

సోష‌ల్ మీడియాకి అడ్డు అదుపు అనేది లేక‌పోవ‌డంతో సెల‌బ్రిటీల‌కి సంబంధించిన త‌ప్పుడు వార్త‌లు కొద్ది క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతున్నాయి. అవి వారికి మ‌న‌శ్శాంతి లేకుండా చేస్తున్నాయి. కొన్ని సార్లు స‌హ‌నం ప‌ట్ట‌లేక ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేస్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ మెగాస్టార్ త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌, కోడ‌లు ఐశ్వ‌ర్య‌రాయ్‌ల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ వ‌ల‌న రిలేష‌న్ చెడింద‌ని , వారిద్ద‌రు క‌లిసి ఉండ‌డం లేద‌ని త‌ప్పుడు క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ విష‌యాల‌పై ఫైర్ అవుతూ అభిషేక్ ట్వీట్ ద్వారా అస‌లు క్లారిటీ ఇచ్చాడు.

ఇటీవ‌ల అభిషేక్ త‌న భార్య ఐశ్వ‌ర్య‌రాయ్ కూతురు ఆరాధ్య‌తో క‌లిసి లండ‌న్ వెళ్ళారు. కొన్ని రోజుల త‌ర్వాత టూర్ ముగించుకొని ముంబై చేరుకున్నారు. వీరిని ఫోటోగ్రాఫర్స్ త‌మ కెమెరాల‌లో బంధించారు. ఆ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుండ‌గా, ఓ ఫోటోలో ఆరాధ్య త‌న తండ్రికి దూరంగా , త‌ల్లిని గ‌ట్టిగా ప‌ట్టుకొని ఉంది. ఐష్ కూడా జాగ్ర‌త్త‌గా కూతురిని తీసుకొని న‌డుస్తున్న‌ట్టు అనిపించింది. దీంతో ఆరాధ్యను అభిషేక్ దగ్గరకు పంపలేదని వీరి మధ్య గొడవలు జరిగాయంటూ ఓ వెబ్ సైట్ వార్తను ప్రచురించింది. ఈ విషయంపై అసహనానికి లోనైన అభిషేక్ తనదైన శైలిలో స్పందించాడు.

ఇలాంటి విషయాలపై తప్పుడు వార్తలు రాయడం తగదు. కొంతైన బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి. దయచేసి తప్పుడు కథలను రూపొందించకుండా ఉండండి. మీ అవ‌స‌రాన్ని నేను అర్దం చేసుకుంటాను. కాని బాధ్యాయుతంగా, ఎలాంటి దురదృష్టకరమైన ఉద్దేశం లేకుండా చేయ‌గలిగితే అభినందించేవాడిని అంటూ ట్వీట్ చేశారు. అభిషేక్ ట్వీట్‌తో పుకార్ల‌కి బ్రేక్ ప‌డిన‌ట్టు అయింది. గ‌తంలో ఆరాధ్య విష‌యంలో ఓ మ‌హిళ అభిషేక్‌ని ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే.

ఆరాధ్య స్కూల్‌కి వెళ్లదా ? ఎప్పుడు చూసిన త‌ల్లితో క‌లిసి షికారుకి వెళుతుంటుంది. పాఠ‌శాల యాజ‌మాన్యం ఆరాధ్య‌కి అన్ని సెల‌వులు ఎలా ఇస్తున్నారు. మీ అమ్మాయి అందంగా ఉంటే చాలు, చ‌దువు అక్క‌ర్లేద‌ని అనుకుంటున్నారా అని ట్వీట్ పెట్టింది. దీనికి వెంట‌నే ఆరాధ్య తండ్రి అభిషేక్ బ‌చ్చ‌న్ .. మేడం వీకెండ్‌లో అన్ని స్కూల్స్‌కి హాలీడేస్ ఉంటాయి. మిగ‌తా రోజుల‌లో నా కూతురు త‌ప్ప‌కుండా స్కూల్‌కి వెళుతుంది. మా వైపు నుండి అయితే ఎలాంటి త‌ప్పు లేదు, మీ ట్వీట్‌లోనే త‌ప్పు ఉందేమో చూసుకోండి అంటూ కౌంట‌ర్ ఇచ్చాడు. ఐష్ ప్ర‌స్తుతం ఫన్నేఖాన్ చిత్రంతో బిజీగా ఉండ‌గా, అభిషేక్ చాలా గ్యాప్ త‌ర్వాత అనురాగ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వంలో మన్‌మర్జాయన్ అనే చిత్రం చేస్తున్నాడు.


4401
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles