అభిషేక్, ఐష్ లతో కరణ్ జోహార్ మూవీ ..!

Fri,December 15, 2017 04:28 PM
Abhishek, Aishwarya rai combo movie released soon

బాలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ ఇద్దరు అగ్రహీరోలకు టాప్ హీరోయిన్లు కోడళ్లుగా వచ్చారు. అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుని ఐశ్వర్యారాయ్ కొన్నేళ్ల కిందటే బచ్చన్ కుటుంబానికి కోడలైంది. ఇక టాలీవుడ్ లో కింగ్ నాగార్జున కుమారుడు నాగచైతన్యను పెళ్లి చేసుకుని సమంత ఇటీవలే అక్కినేని ఇంటి కోడలైంది. అటు అభి- ఐష్, ఇటు చైతూ –సామ్ కూడా కలిసి కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు . ఇప్పుడు విశేషమేంటంటే ... బాలీవుడ్ ఫేవరెట్ దంపతులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ కలిసి త్వరలో ఓ మూవీలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. 2 స్టేట్స్ చిత్ర దర్శకుడు అభిషేక్ వర్మన్ ఈ మూవీకి డైరెక్టర్. కరణ్ జొహార్, సాజిద్ నడియాడ్వాలా ఈ మూవీ తీస్తారని తెలుస్తోంది. అయితే మొదట్లో ఈ సినిమా చేయడానికి ఐష్, అభిలు ససేమిరా అన్నారట . నిర్మాత కరణ్ జొహార్ గట్టిగా ప్రయత్నించడంతో అభిషేక్ – ఐశ్వర్య కలిసి సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటివరకు ఐశ్వర్య, అభిషేక్లు కలిసి కుచ్ న కహో, గురు, బంటీ ఔర్ బబ్లీ, ఉమ్రావ్ జాన్, ధూమ్ 2, ఢాయి అక్షర్ ప్రేమ్ కీ, రావణ్, సర్కార్ రాజ్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

1357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS