సైరాలో సుదీప్ లుక్ అవుట్..!

Sun,September 2, 2018 07:39 AM
Abhinaya Chakravarthy Kichcha Sudeepa Motion Teaser

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియ‌ర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం సైరా. భార‌త మాత‌కు బిగుసుకున్న సంకెళ్ళ‌ని తెంచ‌డానికి రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించిన వ్య‌క్తి ఉయ్యాల వాడ న‌ర‌సింహ‌రెడ్డి. ఆ నాటి రోజుల‌లో బ్రిటీష్ సైనికుల‌తో అర్ధ‌రాత్రి, అప‌రాత్రి అనే తేడా లేకుండా యుద్ధం చేశాడు. ఇప్పుడు ఆయన జీవిత నేప‌థ్యంలో చిరు 151వ చిత్రంగా సురేంద‌ర్ రెడ్డి సైరా అనే మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానుంది. ఇటీవ‌ల చిరు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇది కొద్ది గంట‌ల‌లో రికార్డు వ్యూస్ సాధించి అందరికి షాక్ ఇచ్చింది.

సైరా చిత్రంలో న‌య‌న‌తార‌, చిరంజీవి, అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు , త‌మ‌న్నా, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. సుదీప్ అవుకు రాజు అనే పాత్ర‌లో క‌నిపించ‌నుండగా, ఆయ‌న బ‌ర్త్‌డే( సెప్టెంబ‌ర్ 2) సంద‌ర్భంగా మోష‌న్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో గ్రాండియ‌ర్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు కిచ్చా సుదీప్. పూర్తిగా నలుపు రంగు కాస్ట్యూమ్ లో ఉన్న సుదీప్ నలుపు రంగు తలపాగాతోనే కనిపించాడు. పొడవాటి జుట్టు.. బాగా పెరిగిన గడ్డం.. మెలితిప్పిన మీసాలు.. నుదుటన తిలకం తో పవర్ఫుల్ గా ఉన్నాడు. ఇక భుజాన గొడ్డలి.. నడుము భాగంలో ఒక ఖడ్గంతో ఒక లాంటి లుక్ ఇచ్చాడు. పోస్టర్ వెనక మంటలు విధ్వంసం.. బ్రిటిష్ సైనికులు గుర్రాలపై ఉన్నారు.

సైరా చిత్రానికి బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా యాక్షన్‌ సీన్స్ కోసం స్కైఫాల్‌, హ్యారీ పొట‌ర్‌ల‌కి ప‌ని చేసిన హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్లు ప‌ని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా ర‌త్న‌వేలు ఉన్నారు.

3233
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles