విశాల్ ‘అభిమన్యుడు’ లుక్ అదుర్స్

Wed,December 13, 2017 10:52 AM
విశాల్ ‘అభిమన్యుడు’ లుక్ అదుర్స్

తమిళ నటుడు విశాల్, గ్లామర్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ఇరుంబు థిరై. తెలుగులో ఈ చిత్రం అభిమన్యుడు గా రిలీజ్ కానుంది. పీయస్ మిత్రన్ దర్శకత్వంలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై హరి గుజ్జలపూడి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే చిత్రంలో విశాల్ కి సంబంధించి రెండు లుక్స్ విడుదల చేసిన యూనిట్ తాజాగా మరో లుక్ విడుదల చేసింది. ఇది స్టన్నింగ్ గా ఉండటంతో పాటు అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. లావిష్ గా తెరకెక్కిన ఇరుంబు థిరై చిత్రం పాటలు డిసెంబర్ 27న విడుదల చేయాలని భావిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.
1620

More News

VIRAL NEWS