ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్న ప్ర‌ముఖ డ్యాన్స‌ర్‌

Thu,August 23, 2018 12:51 PM
Abhijeet Shinde Commits Suicide

ర‌ణవీర్ సింగ్‌, ర‌ణ్‌భీర్ క‌పూర్‌ల‌తో క‌లిసి చేసిన బాలీవుడ్ డ్యాన్స‌ర్ అభిజిత్ షిండే ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్నాడు. త‌న ఇంట్లో సీలింగ్‌కి ఉరి వేసుకొని బ‌ల‌వ‌న్మ‌ర‌ణంకి పాల్ప‌డిన‌ట్టు స్థానికులు గుర్తించారు. ప్ర‌స్తుతం ఈ కేసు విష‌యంలో ద‌ర్యాప్తు జ‌రుపుతున్న పోలీసులు ఆయ‌న ఇంట్లో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో తన బ్యాంక్‌ అకౌంట్‌ను కుమార్తె పేరుపై ట్రాన్స్‌ఫ‌ర్‌ చేయమని కోరాడు. త‌న భార్య నుండి కొన్నాళ్లుగా దూరం ఉంటున్న అభిజిత్ డిప్రెష‌న్ కారణంగానే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని చెబుతున్నారు. పోలీసుల ద‌ర్యాప్తు ప్ర‌కారం ఆయ‌న భార్య మూడేళ్ల కూతురిని క‌ల‌వ‌కుండా అడ్డుకుంద‌నే కార‌ణంగానే మ‌న‌స్థాపంతో అభిజిత్ ఆత్మ‌హ‌త్య చేసుకొని ఉంటాడ‌ని తెలుస్తుది. ఈ కేసుకి సంబంధించి పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

2593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS