ప్రేర‌ణాత్మ‌క అంశాల‌తో అబ్ధుల్ క‌లాం బ‌యోపిక్

Tue,May 14, 2019 09:48 AM

మిసైల్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం బ‌యోపిక్‌ని తెలుగులో రూపొందించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ అబ్దుల్ క‌లాం బ‌యోపిక్‌ని త‌మ సంస్థ‌లో రూపొందించ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. రామ‌బ్ర‌హ్మం సుంక‌ర , అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో అబ్దుల్ క‌లాం బ‌యోపిక్‌ని హాలీవుడ్ స్టాండ‌ర్డ్స్‌లో తెర‌కెక్కించ‌నున్నాట‌. అయితే ఇందులో అబ్ధుల్ క‌లాం జీవితంలో ఏం జ‌రిగింది అనే అంశాల‌ని కాకుండా చిన్న‌త‌నం లోని వివిధ ద‌శ‌ల‌లో ఆయ‌న ఆలోచ‌న‌లు ఎలా ఉండేవి అన్న దానిపై సినిమా తీయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.


అబ్దుల్‌ కలాం 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పేద కుటుంబలో పుట్టిన ఆయన ఎన్నో అడ్డంకులను ఎదర్కొని రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. అనేక ఇబ్బందుల‌ని ఎదుర్కొని ఆయ‌న ఈ స్థాయికి చేరుకోగా, ఆయ‌న ఆలోచ‌న‌లో దాగి ఉన్న ప్రేరణాత్మకమైన విషయాల నేప‌థ్యంలో ఈ బ‌యోపిక్ రూపొందినున్న‌ట్టు తెలుస్తుంది. విభిన్న కోణంలో తీయ‌నున్న ఈ బ‌యోపిక్ లో క‌లాం పాత్ర‌ని ఎవ‌రు చేస్తారా అనే దానిపై సందేహాలు నెల‌కొన్నాయి. వ‌చ్చే ఏడాది నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రం రాజ్ చెంగప్ప వ్రాసిన కలాం జీవిత చరిత్ర ఆధారంగా రూపొంద‌నుంద‌ని స‌మాచారం. 83 ఏండ్ల వయస్సులో జూలై 2015న ఐఐఎం షిల్లాంగ్‌లో ప్రసంగిస్తూ కలాం కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే .

1014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles