అల్లు శిరీష్ 'ఏబీసీడీ' ట్రైల‌ర్ విడుద‌ల‌

Tue,May 14, 2019 09:34 AM
ABCD Release Trailer shakes the internet

ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లు శిరీష్ ప్ర‌స్తుతం మ‌ల‌యాళ చిత్రం ఎబిసిడి (అమెరికన్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ)ని రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే . తెలుగులోను ఇదే పేరుతో మూవీ రూపొందుతుంది. నూత‌న ద‌ర్శ‌కుడు సంజీవ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతుండ‌గా ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్‌ రంగినేని, మధుర’ శ్రీధర్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యూఎస్ నుండి విహార యాత్ర‌కి ఇండియాకి వ‌చ్చిన ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి త‌న జీవితంలో ఎదురైన సంఘ‌ట‌ల‌ని ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్లాడ‌నేది సినిమాలో ఆస‌క్తికరంగా చూపించ‌నున్నార‌ట‌ . ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు. కృష్ణార్జున యుద్ధం చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించి మెప్పించిన రుక్స‌ర్ థిల్లాన్ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక సోమ‌వారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి నేచుర‌ల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో మూవీ రిలీజ్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని సన్నివేశాలు ఫ‌న్నీగా ఉన్నాయి. ఈ మూవీ శిరీష్‌కి మంచి హిట్ అందించ‌డం ఖాయ‌మ‌ని టీం భావిస్తుంది. చాలా రోజుల తర్వాత మాస్టర్ భరత్ ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుండ‌గా .. నాగబాబు, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. జుడా సంధి చిత్రానికి సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు.

807
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles