ఆత్మ కోసం అన్వేష‌ణ‌.. ఆవిరి టీజ‌ర్

Sat,September 28, 2019 09:11 AM

ఒక‌ప్పుడు న‌టుడిగా అల‌రించిన ర‌విబాబు ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా విభిన్న క‌థా చిత్రాల‌ని తెర‌కెక్కిస్తూ వ‌స్తున్నాడు . ఆ మ‌ధ్య పందిపిల్ల ప్ర‌ధాన పాత్ర‌లో అదుగో అనే సినిమాని రూపొందించి అంద‌రి దృష్టి ఆక‌ర్షించాడు. ఈ సినిమా అనుకున్నంత ఆద‌ర‌ణ పొంద‌లేక‌పోయిన జ‌నాళ్ళ నోళ్ళ‌ల్లో మాత్రం నానుతూ వ‌చ్చింది . తాజాగా ర‌విబాబు ఆవిరి అనే సినిమా తెర‌కెక్కిస్తూ న‌టిస్తున్నాడు . ఇందులో ర‌విబాబుతో పాటు నేహా చౌహ‌న్, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్, ముక్త‌ర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఫ్లైయింగ్ ప్రాగ్స్ చిత్రాన్ని నిర్మిస్తుంది. స‌క్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు త‌న సొంత బేన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్ మీదుగా చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాల‌ని బ‌ట్టి ఈ చిత్రాన్ని కూడా ప్రేక్ష‌కుల‌కి థ్రిల్ క‌లిగించేలా ర‌విబాబు తెరకెక్కించిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. మీరు నివసిస్తున్న ఇంట్లో మీకు తెలియని కంపెనీ ఉంటే? మీరు ఆత్మను ఎలా గుర్తిస్తారు ? మీకు తెలిస్తే మాకు చెప్పండ‌ని టీజ‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.


944
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles