'ఆట‌గాళ్ళు' అఫీషియ‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌

Sat,June 30, 2018 12:56 PM
Aatagallu Official Trailer released

నారా రోహిత్, ద‌ర్శ‌న బనిక్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ప‌ర‌చూరి ముర‌ళి తెర‌కెక్కించిన చిత్రం ఆట‌గాళ్లు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. బ్ర‌హ్మానందం కీల‌క పాత్ర‌లో క‌నిపించి అల‌రించ‌నున్నాడు. ఈ చిత్రం రీసెంట్‌గా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. మేక‌ర్స్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేసి జూలై 5న చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు. ఇక కొద్ది సేప‌టి క్రితం చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇది సినిమాపై భారీ ఆసక్తిని క‌లిగిస్తుంది. సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందనే చెప్ప‌వ‌చ్చు . నారా రోహిత్ ఈ మూవీలో ద‌ర్శ‌కుడి పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్ మూవీ క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొందిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధిస్తుంద‌ని టీం భావిస్తుంది. ఇదిలా ఉంటే నారా రోహిత్ ప్ర‌స్తుతం శ‌బ్ధం అనే మూవీతో బిజీగా ఉన్నాడు. త్వ‌ర‌లో తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఆట‌నాదే వేట‌నాదే అనే చిత్రం కూడా చేయ‌నున్నాడు.

906
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS