ఆట‌గాళ్లు టీజ‌ర్ వ‌చ్చేసింది

Sat,June 9, 2018 11:11 AM
Aatagallu Official Teaser released

గ‌త ఏడాది వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నారా రోహిత్ ఈ ఏడాది కూడా డిఫ‌రెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ప‌రుచూరి ముర‌ళి ద‌ర్శ‌క‌త్వంలో ఆటగాళ్ళు అనే చిత్రాన్ని చేస్తున్నాడు రోహిత్‌. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు ఓ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ద‌ర్శ‌న బ‌నిక్ క‌థానాయిక . ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించారు. కొద్ది రోజులుగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం రీసెంట్‌గా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. మేక‌ర్స్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేసి జూలై 5న చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.

ఆ మ‌ధ్య స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఆట‌గాళ్ళు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇందులో నారా రోహిత్‌, జ‌గ‌ప‌తి బాబు లుక్స్ అభిమానుల‌ని ఆక‌ట్టుకున్నాయి. తాజాగా టీజ‌ర్ విడుద‌ల చేసి సినిమాపై భారీ అంచ‌నాలు పెంచారు. ఈ చిత్రంలో రోహిత్‌, జ‌గ‌ప‌తి బాబు పాత్ర‌లు పోటాపోటీగా ఉంటాయ‌ట‌. టీజ‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే చిత్రంలో నారా రోహిత్ ద‌ర్శ‌కుడి పాత్ర పోషించిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. ఇదిలా ఉండ‌గా నారా రోహిత్ ప్ర‌స్తుతం శ‌బ్ధం అనే మూవీతో బిజీగా ఉన్నాడు. త్వ‌ర‌లో తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఆట‌నాదే వేట‌నాదే అనే చిత్రం కూడా చేయ‌నున్నాడు. ఆట‌గాళ్లు చిత్రంలో బ్ర‌హ్మానందం కీల‌క పాత్ర పోషించాడు.

2129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles