గోపిచంద్ అభిమానుల‌కు గుడ్ న్యూస్

Sat,May 27, 2017 01:10 PM
AARADUGULA BULLET release date fixed

ఒకప్పుడు మాస్ చిత్రాలతో అలరించిన గోపిచంద్ ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ అందరి అభిమానాన్ని దక్కించుకుంటున్నాడు. లౌక్యం, జిల్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో అలరించిన గోపిచంద్ ఆ తర్వాత సౌఖ్యం తో బోల్తా పడ్డాడు. కొన్నేళ్ళుగా గోపిచంద్ మూవీ ఒక్క‌టి కూడా విడుద‌ల కాక‌పోవ‌డంతో అభిమానులు కాస్త డ‌ల్ అయ్యారు. ఈ క్ర‌మంలో వారి ఆనందాన్ని పెంచేందుకు వ‌రుస సినిమాలు రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు ఈ మాచో హీరో . త్వ‌ర‌లోనే గోపిచంద్ న‌టించిన ఆక్సీజ‌న్ చిత్రాన్ని విడుద‌ల చేస్తుండ‌గా, బి.గోపాల్ తెర‌కెక్కిస్తున్న ఆర‌డుగుల బుల్లెట్ కి కూడా టైం ఫిక్స్ చేశారఉ. జూన్ 9న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందించాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్ర ఆడియో రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌నున్నారు. మ‌రో వైపు గోపిచంద్ .. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో గౌత‌మ్ నందా అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇలా గోపిచంద్ వ‌రుస సినిమాలు థియేట‌ర్స్ లోకి రానుండ‌డంతో అభిమానుల‌లో ఆనందం తారా స్థాయికి చేరుకుంది.

1404
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles