వివాదంలో 'ఆరడుగుల బుల్లెట్'

Wed,June 7, 2017 12:57 PM
AARADUGULA BULLET movie is in trouble

మాచో హీరో గోపిచంద్, స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఆరడుగుల బుల్లెట్. సి. కళ్యాణ్‌ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం అనేక అవాంతరాలను దాటి జూన్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. రిలీజ్ కి మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తుంది. అయితే ఓ వివాదం సినిమాకి అడ్డంకిగా మారే అవకాశం ఉందని పలు వార్తలు వస్తున్నాయి. సహదేవ్ అనే ఎన్నారై తన దగ్గర సి. కళ్యాణ్‌ రూ. 6 కోట్లు అప్పుగా తీసుకొని చీట్ చేశాడని ఆరోపిస్తున్నాడు. తీసుకున్న మొత్తం చెల్లించే వరకు సినిమా విడుదల ఆపేయాలని సహదేవ్ సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. దీంతో సినిమా రిలీజ్ పై సందిగ్ధం నెల‌కొంది. ఆరడుగుల బుల్లెట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రంగా తెరకెక్కగా ఇందులో నయనతార కథానాయికగా నటించింది. మణిశర్మ సంగీతం అందించాడు.

2135
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles