ఐష్ త‌న‌య‌, షారూఖ్ త‌న‌యుడి డ్యాన్స్ అదుర్స్‌

Mon,December 18, 2017 12:15 PM
Aaradhya Bachchan, abram live performance video

బాలీవుడ్‌లో ప్ర‌స్తుతం టాప్ స్టార్స్‌గా వెలుగొందుతున్న వారిలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌, మాజీ మిస్ ఇండియా ఐశ్వ‌ర్య‌రాయ్‌లు, సూప‌ర్ స్టార్ అమీర్ ఖాన్‌లు ఒక‌రు. వీరు రీసెంట్‌గా దీరూభాయి అంబానీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ వార్షికోత్స‌వంకి పిల్ల‌ల‌తో క‌లిసి హాజ‌రయ్యారు. ఈ కార్యక్ర‌మానికి అభిషేక్ బ‌చ్చ‌న్‌, గౌరీఖాన్‌, హృతిక్ రోష‌న్‌,సుహానే ఖాన్‌,జూహీ చావ్లా, ర‌వీనా టాండ‌న్‌, క‌రీష్మా క‌పూర్‌, లారా ద‌త్తాల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా హాజ‌ర‌య్యారు. అయితే యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా ఐష్ త‌న‌య ఆరాధ్య , షారూఖ్ త‌న‌యుడు అభ్‌రామ్‌, అమీర్ ఖాన్ కుమారుడు ఆజాద్‌లు స్టేజ్‌పైన స్టెప్పులు వేసి అల‌రించారు. వీరి స్టెప్పులు ఆహుతుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఆరాధ్య‌, ఆజాద్‌లు క‌లిసి ఒకే పాట‌కి స్టెప్స్ వేయ‌గా, మ‌రో సాంగ్‌లో అబ్‌రామ్ స్టెప్స్ వేశాడు. ప్ర‌స్తుతం వీరి ప‌ర్‌ఫార్మెన్స్‌కి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక చివ‌రిగా అందాల తార ఐష్ కూడా పిల్ల‌ల‌తో క‌లిసి స‌ర‌దాగా స్టెప్పులు వేసి అల‌రించింది. మ‌రి ఈ వీడియోల‌పై మీరు ఓ లుక్కేయండి.2619
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS