పూర్తి స్థాయి దర్శకుడినయ్యాక నటనకు గుడ్ బై..

Sun,March 17, 2019 05:44 PM
aamirkhan told when he would stop acting


బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ బాక్సాపీస్ వద్ద నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్ గా వస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నాడు అమీర్. సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా చూసుకునే అమీర్..నటనకు ఎపుడు గుడ్ బై చెప్తాడో స్వయంగా వెల్లడించాడు.

ఇటీవలే మీడియాతో చేసిన చిట్ చాట్ లో అమీర్ మాట్లాడుతూ..సినిమాలు తెరకెక్కించడమంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం వల్లే తారే జమీన్ పర్ చిత్రంతో దర్శకుడిగా మారా. నటనలో నా ప్రయాణం ఇపుడే మొదలైనట్లు అనిపిస్తోంది. నేను పూర్తిస్థాయి దర్శకుడిగా మారాక నటనకు గుడ్ బై చెప్పేస్తానన్నాడు దంగల్ స్టార్. అమీర్ చేయనున్న కొత్త ప్రాజెక్టు కోసం ఏకంగా 20 కిలోల బరువు తగ్గనున్నాడు. ఇందులో లాల్ సింగ్ పాత్రలో కనిపించనున్నాడు. దంగల్ చిత్రం కోసం అమీర్ 20 కిలోలకుపైగా బరువు పెరిగిన విషయం తెలిసిందే.

4232
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles