చైనాలో అమీర్‌ఖాన్ ప్రమోషన్స్ రద్దు

Tue,December 18, 2018 05:15 PM
aamirkhan promotions cancelled later conducted in china

బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ వచ్చే వారం చైనాలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అమీర్‌ఖాన్ అభిమానులతో చిట్‌చాట్ చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. గువాంగ్‌డాంగ్ యూనివర్సిటీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ క్యాంపస్ పరిధిలోని లావెండే హోటల్‌లో మీట్ అండ్ గ్రీట్ జరుగాల్సి ఉంది. అయితే ఈవెంట్ నిర్వహకులు మీట్ అండ్ గ్రీట్ సెషన్ కోసం యూనివర్సిటీ అధికారుల అనుమతి తీసుకోలేదు. దీంతో అమీర్‌ఖాన్ ప్రమోషన్ రద్దయింది. అమీర్‌ఖాన్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నట్లు కొంతమంది విద్యార్థుల వల్ల సోషల్‌మీడియా ద్వారా తెలిసింది. కార్యక్రమం ప్రారంభమవ్వాల్సిన కొద్ది సమయం ముందే మీట్ అండ్ గ్రీన్ సెషన్ గురించి విద్యార్థులు మాట్లాడుకున్నారని యూనివర్సిటీ అధికారి ఒకరు తెలిపారు.

నిర్వాహకులు అనుమతి తీసుకోకపోవడం వల్లే అమీర్‌ఖాన్ కార్యక్రమం రద్దయిందని విద్యార్థులు వెల్లడించారు. నిర్వాహకులు చేసేదేమి లేక క్యాంపస్‌కు సమీపంలోని మరో హోటల్ లో మీట్ అండ్ గ్రీట్ సెషన్‌ను ఏర్పాటు చేశారు. నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఈ కార్యక్రమం పూర్తయేసరికి రాత్రి 11 గంటలు అయింది. మొత్తానికి అమీర్‌ఖాన్ మాత్రం కొద్దిగా ఆలస్యమైనా చైనాలో తన అభిమానులను కలుసుకున్నాడు. అమీర్ ఖాన్ మా స్టైల్ లో అంటూ చైనా అభిమానులు ట్విట్టర్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసుకున్నారు.


1672
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles