ప్రేమ‌లో ఉన్న‌ట్టు క‌న్‌ఫాం చేసిన అమీర్ కూతురు

Thu,June 13, 2019 10:13 AM
Aamir Khans daughter Ira Khan confirms relationship with musician

మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ కూతురు ఇరా ఖాన్ కొన్నాళ్ళుగా సంగీత కారుడు మిశాల్ కిర్ప‌లానితో డేటింగ్‌లో విష‌యం ఉన్న తెలిసిందే. వీరిద్ద‌రి ప్రేమాయ‌ణం గురించి కొన్నాళ్ళుగా ఎన్నో రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్‌మీ ఎనీథింగ్ సెషన్‌లో పాల్గొన్న ఇరా ఖాన్ త‌న ప్రేమాయ‌ణంపై స్పందించింది. ఓ నెటిజన్ మీరు ఎవ‌రితోనైన డేటింగ్‌లో ఉన్నారా అని ప్ర‌శ్నించ‌గా, అందుకు స‌మాధానంగా ఇరాఖాన్ త‌న ప్రియుడితో క‌లిసి దిగిన ఫోటో షేర్ చేసి బ‌దులిచ్చింది. మిశాల్‌తో స‌న్నిహితంగా ఉన్న ఫోటోల‌ని షేర్ చేసిన ఇరా ఇప్ప‌టికైన నా మ‌న‌సులో విష‌యం మీకు అర్ధ‌మైంద‌నుకుంటా అని కామెంట్ పెట్టింది. దీంతో అందరు ఇరా, మిశాల్ త్వ‌రలో పెళ్లి పీట‌లు ఎక్క‌డం ఖాయం అని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అమీర్ త‌నయుడు జునైద్‌కి న‌ట‌న‌లో ఆస‌క్తి ఉండ‌గా, ఇరాకి మాత్రం నిర్మాణ రంగంపై ఆస‌క్తి ఉంద‌ని కాఫీ విత్ క‌ర‌ణ్ షో కార్య‌క్ర‌మంలో అమీర్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

3410
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles