కొత్త లుక్‌లో అమీర్‌ఖాన్‌..ఫొటో లీక్‌

Mon,November 11, 2019 05:01 PM


ముంబై: బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ నటిస్తోన్న తాజా చిత్రం లాల్‌ సింగ్‌ చద్ధా. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి స్టిల్స్‌ బయటకు రాలేదు. అయితే తాజాగా అమీర్‌ ఖాన్‌ సినిమా లొకేషన్‌లో ఉన్న ఫొటో ఒకటి ఆన్‌లైన్‌లో లీకైంది. తలపాగా, పొడవాటి గడ్డంతో టక్కు వేసుకున్న ఫొటో ఒకటి ఇపుడు నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అమీర్‌ఖాన్‌ కొత్త గెటప్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


మీరు నటుడిలా ఉండాలనుకుంటే అమీర్‌లా ఉండండి అని ఓ అభిమాని కామెంట్‌ పోస్ట్‌ చేశాడు. ఇక మరో అభిమాని అమీర్‌ఖాన్‌ సర్దార్‌ గెటప్‌లో చాలా అందంగా కనిపిస్తున్నాడు. అతన్ని గుర్తుపట్టలేం అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. హాలీవుడ్‌ మూవీ ఫారెస్ట్‌ గంప్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ను అమీర్‌ఖాన్‌ విడుదల చేశాడు. అద్వైత్ చంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా..వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.



1468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles