మీటూ ఎఫెక్ట్: సినిమా నుండి త‌ప్పుకున్న అమీర్

Thu,October 11, 2018 12:53 PM
Aamir Khan Quits Film on Gulshan Kumar

ప్ర‌స్తుతం ఇండియా అంతా మీటూ ఉద్య‌మం ఉదృతంగా సాగుతున్న విష‌యం తెలిసిందే. సినీ న‌టి గీతిక త్యాగితో జాలీ ఎల్ఎల్‌బీ ద‌ర్శ‌కుడు సుభాష్ క‌పూర్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో ఆమె అత‌ని చెంప ప‌గ‌ల‌గొట్టిన‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ఎడ‌మ చేయి లేక‌పోయిన మంచి టాలెంట్‌తో అతను అద్భుత‌మైన చిత్రాలు తీస్తాడ‌నే పేరు ఆయ‌న‌కుంది. అయితే ఈ ద‌ర్శ‌కుడు త‌న‌ని లైంగికంగా వేధించాడ‌ని ఓ వీడియో ద్వారా సుభాష్ బాగోతాన్ని బ‌ట్ట బ‌య‌లు చేసింది గీతిక. ఈ విష‌యం అమీర్‌కి కూడా తెలియ‌డంతో సుభాష్‌తో చేయవ‌ల‌సి ఉన్న మొఘ‌ల్( గుల్షాన్ కుమార్ బ‌యోపిక్) సినిమా నుండి త‌ప్పుకున్న‌ట్టు పేర్కొన్నాడు. అమీర్ భార్యకిర‌ణ్ రావు మాట్లాడుతూ.. అమీర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌లో ఇలాంటి అసాంఘిక ప‌నుల‌ని అస్స‌లు స‌హించం. ఇండ‌స్ట్రీ ఎప్పుడు సుఖంగా ఉండాల‌ని మేము కోరుకుంటాం. మా సంస్థ‌లో ప‌ని చేయ‌బోవు చిత్ర ద‌ర్శ‌కుడు చెడు ప‌నులు చేసాడ‌ని తెలిసి మేము అత‌నితో సినిమా ఎలా తీస్తాం అని కిర‌ణ్ రావు అన్నారు.

అమీర్ ఖాన్, కిర‌ణ్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌కి వెంట‌నే త‌న ట్విట్ట‌ర్ ద్వారా బ‌దులిచ్చాడు సుభాష్ కపూర్. అమీర్ ఖాన్, అతని భార్య కిర‌ణ్ రావు భావాల‌ని నేను గౌర‌విస్తాను. ఈ విష‌యం చ‌ట్ట విరుద్ధం కావ‌డంతో న్యాయ‌స్థానంలో నా అమాయ‌క‌త్వాన్ని నిరూపించుకోవాల‌ని భావిస్తున్నాను. కానీ నేను ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నాను. నా అనుమ‌తి లేకుండా ఓ వీడియోని చిత్రీక‌రించి దానిని సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేయ‌డం ఎంత వ‌ర‌కు కరెక్ట్ అని ప్రశ్నించాడు. బాలీవుడ్‌లో వచ్చిన ‘ఆత్మ’ అనే చిత్రంలో గీతిక నటించారు. ఇందులో సినీ నటి బిపాసా బసు ప్రధాన పాత్రలో నటించిన సంగ‌తి తెలిసిందే.
2405
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles