అమీర్ లుక్ చూస్తే నోరెళ్ళ‌పెట్టాల్సిందే..!

Sun,December 8, 2019 09:56 AM

ఏ పాత్ర‌లోనైన ఇట్టే ఒదిగిపోయే న‌టుడు బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్. ప్ర‌స్తుతం అమీర్ లాల్‌ సింగ్‌ చద్ధా అనే చిత్ం చేస్తున్నాడు. ఇటీవ‌ల అమీర్‌ ఖాన్‌ సినిమా లొకేషన్‌లో ఉన్న ఫొటో ఒకటి ఆన్‌లైన్‌లో లీకైంది. తలపాగా, పొడవాటి గడ్డంతో ఉన్న అమీర్‌ని చూసి అభిమానులు షాక్ అయ్యారు. తాజాగా అమీర్‌కి సంబంధించి మ‌రో ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. టర్కీలో ఉంటున్న అభిమాని ఒకరు జైసల్మేర్‌లో అమీర్‌ఖాన్ షూటింగ్ సెట్ నుంచి ఒక ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటోలో అమీర్ ఖాన్ టోపీ ధరించి, పెద్ద గడ్డంతో, పొడవైన జుట్టుతో కనిపిస్తున్నారు. అమీర్‌ని చూసి అభిమానులు నోరెళ్ళ‌పెడుతున్నారు హాలీవుడ్‌ మూవీ ఫారెస్ట్‌ గంప్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అద్వైత్ చంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా..వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.కరీనాకపూర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

1565
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles