అంధుడి పాత్ర‌లో మ‌రో న‌టుడు ..!

Sun,December 17, 2017 03:08 PM
అంధుడి పాత్ర‌లో మ‌రో న‌టుడు ..!

ఈ మ‌ధ్య మ‌న తెలుగు హీరోలు ట్రెండ్ మార్చారు. కాస్త‌ కొత్త ద‌నం ట్రై చేస్తున్నారు. విభిన్న పాత్ర‌ల‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన విందు అందిస్తున్నారు. ముఖ్యంగా అంధుడి పాత్ర‌ల‌లో న‌టించేందుకు మరింత ఆస‌క్తి చూపుతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలో రవితేజ, ‘అంధగాడు’ చిత్రంలో రాజ్‌తరుణ్‌లు అంధుడి పాత్రల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు స‌రైనోడు, నిన్ను కోరి చిత్రాలో న‌టించి మెప్పించిన ఆది పినిశెట్టి కూడా దివ్యాంగుడిగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు తెలుస్తోంది. అయితే అది ఏ చిత్రం, ఎవ‌రి ద‌ర్శ‌కత్వంలో రానున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం సుకుమార్ తెర‌కెక్కిస్తున్న రంగ‌స్థ‌లం 1985 చిత్రంతో బిజీగా ఉన్నాడు ఆది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ సోద‌రుడిగా న‌టిస్తున్నాడు. 2018లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

1442
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS