పవన్ మూవీ రూమర్స్ కి చెక్..!

Sun,April 16, 2017 01:53 PM
aadi pinisetty  plays negative role in pawan movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ 25వ మూవీగా రూపొందుతున్న ఈ చిత్ర టైటిల్ ఇంజనీర్ బాబు అని అంటున్నారు. ఇందులో సీనియర్ నటి ఖుష్ బూ కీలక పాత్ర పోషిస్తుండగా, బాలీవుడ్ నటుడు సోను సూద్ ని ముఖ్య పాత్రకు తీసుకుంటున్నట్టు ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ తెరకెక్కించిన అతడు, జులాయి చిత్రాలలో నటించిన సోనుసూద్ ఇప్పుడు పవన్ మూవీలోను పవర్ ఫుల్ పాత్ర పోషించడం ఖాయం అన్నారు. కాని ఇప్పుడు ఈ వార్తలు రూమర్ అని తేలింది. సరైనోడు సినిమాలో బన్నీకి ప్రతినాయకుడిగా నటించిన ఆది పినిశెట్టిని నెగెటివ్ రోల్ పోషించేందుకు తీసుకున్నట్టు సమాచారం. దాదాపు ఇదే వార్త ఫైనల్ అని ఫిలింనగర్ టాక్ . హారిక హాసిని బేనర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు.

1773
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles