ఈ సారి అథ్లెట్‌గా..

Tue,May 7, 2019 10:39 AM
Aadhi Pinisetty will be playing the lead role as athelete in the sports drama

ఒకే చ‌ట్రంలో ఇరుక్కుపోకుండా వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందిస్తున్న న‌టుడు ఆది పినిశెట్టి. ఒక‌వైపు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తూనే మ‌రోవైపు హీరోగా ప‌లు చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా ఆయ‌న ఓ స్పోర్ట్స్ డ్రామాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. నూత‌న ద‌ర్శ‌కుడు పృథ్వి ఆదిత్య ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. అథ్లెటిక్స్‌కు సంబంధించిన కథ కాగా, ఇందులో ఆది అథ్లెట్‌గా క‌నిపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాను బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఐబీ కార్తికేయ‌న్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. పీఎంఎం ఫిల్మ్స్, జి.మ‌నోజ్‌, జి. శ్రీహ‌ర్ష (క‌ట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్‌) స‌హ నిర్మాత‌లుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త‌న క‌ల‌ని సాకారం చేసుకోవ‌డానికి హీరో ఎలాంటి ప్ర‌య‌త్నం చేసాడ‌న్నది ద‌ర్శ‌కుడు ఆస‌క్తిక‌రంగా చూపించ‌నున్నాడ‌ట‌. రంగ‌స్థ‌లం చిత్రంలో ఆది .. చెర్రీ అన్న‌య్య పాత్ర‌లో ఎంత‌గానో అల‌రించిన విష‌యం తెలిసిందే.

1062
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles