రంగ‌స్థ‌లంలో ఆది పినిశెట్టి స్ట‌న్నింగ్ లుక్ అవుట్

Tue,March 13, 2018 10:48 AM
Aadhi Pinisetty special role in rangasthalam

ఆది పినిశెట్టి.. ప్ర‌స్తుతం ఈ పేరు టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం అయింది. ఈ మధ్య భారీ విజయం సాధించిన సరైనోడు, నిన్ను కోరి లాంటి చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు ఆది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన అజ్ఞాత‌వాసి చిత్రంలోను ముఖ్య పాత్రని పోషించాడు. ఇందులో తన పాత్ర చాలా భిన్నంగా ఉంది. ఇక రీసెంట్‌గా రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన‌ రంగస్థలంలోను కీలక పాత్ర చేసాడు. ఆయ‌న పాత్రకి సంబంధించిన ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. చ‌ర‌ణ్‌కి అన్న‌య్య‌గా కె.కుమార్ బాబు పాత్రలో యువ రాజ‌కీయ నేత‌గా ఆది క‌నిపించ‌నున్నాడు. తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్‌లో ఆది పినిశెట్టి డిఫ‌రెంట్ లుక్‌తో క‌నిపిస్తుండ‌గా, పోస్ట‌ర్‌పై రంగ‌స్థ‌లం గ్రామ పంచాయితీ ఎన్నిక‌ల‌లో ప్రెసిడెంట్ అభ్య‌ర్ధిగా గ్రామ ప‌జ‌లు బ‌ల‌ప‌రిచిన కె.కుమార్ బాబు లాంత‌రు గుర్తుకే మీ ఓటు ముద్ర‌ని వేసి గెలిపించండి అని రాసి ఉంది. అంటే గ్రామ ప్రెసిడెంట్ ప‌ద‌వికి పోటీ చేసే పాత్ర‌లో ఆది క‌నిపించ‌నున్నాడ‌న్న‌మాట‌. రంగ‌స్థ‌లం చిత్రం ప‌ల్లెటూరి నేప‌థ్యంలో తెర‌కెక్క‌గా, తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్స్‌, సాంగ్స్ ఆ నాటి ప‌రిస్థితుల‌కే త‌గ్గ‌ట్టుగానే సినిమా రూపొందింద‌ని గుర్తు చేస్తున్నాయి. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రంగ‌స్థ‌లం చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన విష‌యం విదిత‌మే.

3504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles