ఇక ఆ పాత్రలు చేయ‌నంటున్న చ‌ర‌ణ్ బ్ర‌ద‌ర్‌..!

Fri,March 30, 2018 12:44 PM
Aadhi Pinisetty rejects villain roles

ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైనోడు, నిన్ను కోరి, అజ్ఞాత‌వాసి వంటి చిత్రాల‌లో నెగెటివ్ షేడ్‌తో ఉన్న పాత్ర‌ల‌ని పోషించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన న‌టుడు ఆది పినిశెట్టి. స‌పోర్టింగ్ రోల్స్‌లోనే కాకుండా హీరోగాను రాణిస్తున్నాడు. తాజాగా విడుద‌లైన రంగ‌స్థ‌లం చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ సోద‌రుడు కుమార్ బాబు పాత్ర పోషించాడు ఆది. ఇందులో మృదు స్వభావిగా.. గొడవలకు దూరంగా ఉంటూనే అన్యాయంపై పోరాటం చేసే వ్యక్తిగా చక్కగా నటించారు. ఈయ‌న పాత్ర‌కి మంచి అప్లాజ్ వ‌చ్చింది. అయితే హీరోగా ప‌లు సినిమా ఆఫ‌ర్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో కొద్ది రోజుల పాటు విల‌న్ పాత్ర‌ల‌కి దూరంగా ఉండాల‌ని ఆది భావిస్తున్నాడ‌ట‌. బ‌డా ద‌ర్శ‌కులు కూడా ఆదితో సినిమా చేయాల‌ని క్యూ క‌డుతుండ‌డంతో ఆయ‌న ఈ నిర్ణయం తీసుకున్నాడ‌ని టాక్‌. ఒకవైపు హీరోగా చేస్తూనే, మరో వైపు సపోర్టింగ్ రోల్స్ లో అలరిస్తున్న ఆది పినిశెట్టి త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కనున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ప్రస్తుతం తన ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని, వీలైనంత త్వరలో మీకు గుడ్ న్యూస్ అందిస్తానని అన్నాడు ఈ స్టైలిష్ హీరో కమ్ విలన్.

3999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles