స్పోర్ట్స్ జోన‌ర్ చిత్రంలో తొలి సారి న‌టిస్తున్న రంగ‌స్థ‌లం న‌టుడు

Mon,June 3, 2019 07:55 AM
Aadhi Pinisetty plays a role of Athelete

ఒకే చ‌ట్రంలో ఇరుక్కుపోకుండా వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందిస్తున్న న‌టుడు ఆది పినిశెట్టి. ఒక‌వైపు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తూనే మ‌రోవైపు హీరోగా ప‌లు చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా ఆయ‌న ఓ స్పోర్ట్స్ డ్రామాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. నూత‌న ద‌ర్శ‌కుడు పృథ్వి ఆదిత్య ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. స్పోర్ట్స్ జోన‌ర్ చిత్రంలో ఆది పినిశెట్టి న‌టించ‌డం ఇదే తొలిసారి. ఈ చిత్రం అథ్లెటిక్స్‌కు సంబంధించిన కథ కాగా, ఇందులో ఆది అథ్లెట్‌గా మారే క్ర‌మంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చూపించ‌నున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాను బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఐబీ కార్తికేయ‌న్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. పీఎంఎం ఫిల్మ్స్, జి.మ‌నోజ్‌, జి. శ్రీహ‌ర్ష (క‌ట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్‌) స‌హ నిర్మాత‌లుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. చిత్రంలో క‌థానాయిక‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

3190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles