బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆది పినిశెట్టి ప్రాజెక్టుల‌ని ప్ర‌క‌టిస్తున్న నిర్మాత‌లు

Sat,December 14, 2019 11:54 AM

కెరీర్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకుంటున్న కుర్ర హీరో ఆది పినిశెట్టి. తెలుగు, త‌మిళంలో వ‌రుస సినిమాలు చేస్తూ అల‌రిస్తున్న ఆది ప్ర‌స్తుతం మూడు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. నూత‌న ద‌ర్శ‌కుడు పృథ్వి ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో క్లాప్ అనే స్పోర్ట్స్ జోన‌ర్ చిత్రంతో పాటు పార్ట్న‌ర్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ న‌గేష్ కుక్కునూర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు.


ఆది పినిశెట్టి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ రోజు ఉద‌యం క్లాప్ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్స్ విడుద‌ల‌య్యాయి. ఇక పార్ట్న‌ర్ అనే చిత్రంలో కూడా ఆది న‌టిస్తుండ‌గా, ఈ మూవీకి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. పోస్ట‌ర్ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది.సైంటిఫిక్ రొమాంటిక్ కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో హ‌న్సిక‌, ప‌ల్ల‌క్ లాల్వానీ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. నూత‌న ద‌ర్శ‌కుడు మ‌నోజ్ దామోద‌రం తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెండు సాంగ్స్ మిన‌హా షూటింగ్ పూర్తి చేసుకుంది . 2020 మొద‌ట్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

ఇక తన మార్కెట్ ని తెలుగుకి పరిమితం కాకుండా వేరే భాషలలోను విస్తరించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు ఆది పినిశెట్టి. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుక్కునూర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఆ సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. జ‌గ‌ప‌తి బాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. దిల్ రాజు స‌మ‌ర్పిస్తున్నారు. అతి త్వర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్లడించ‌నున్నారు. కాగా, నగేష్ కుక్కునూర్ బాలీవుడ్ లో హైదరాబాదా బ్లూస్, లక్ష్మి, ఇక్బాల్ వంటి సినిమాల్ని రూపొందించారు. ఇప్పటి వరకు ఆయన పలు అంతర్జాతీయ, జాతీయ అవార్డులను అందుకున్నారు.

779
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles