కిమ్ అయినా.. ట్రంప్ అయినా.. లోపలేసి కుమ్ముతా.. 'నీవెవరో' టీజర్!

Sun,July 15, 2018 03:25 PM
Aadhi Pinisetty Neevevaro Movie Teaser

కిమ్ అయినా.. ట్రంప్ అయినా.. లోపలేసి కుమ్ముతా అని అంటున్నాడు వెన్నల కిషోర్. అసలు.. వెన్నల కిషోర్‌కు, కిమ్, ట్రంప్‌కు ఏంటి గొడవ అని టెన్షన్ పడకండి. అది నీవెవరో సినిమాలోని డైలాగ్. ఆది పినిశెట్టి, తాప్సి, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా ఇది. ఇవాళ ఈ సినిమా టీజర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నది.

1861
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles