జూ.ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో అరవింద సమేత అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. మూవీ షూటింగ్ 50 శాతం పూర్తైనట్టు తెలుస్తుంది. టీజర్‌ని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఆగస్ట్ 15న విడుదల చేసి ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నారట మేకర్స్. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా, నాగ బాబు, జగపతి బాబు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇక ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1లో ఫైనల్ వరకు వచ్చి విజేతగా నిలిచే అవకాశాన్ని కోల్పోయిన ఆదర్శ్ బాలకృష్ణ కూడా అరవింద సమేతలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
టైటిల్ గెలుచుకేనే అవకాశం మిస్ చేసుకున్న ఆదర్శ్‌కి నా సినిమాలో మంచి క్యారెక్టర్ని ఇస్తానని అప్పట్లో మాట ఇచ్చాడట ఎన్టీఆర్. ఇచ్చిన మాటకి కట్టుబడి అరవింద సమేతలో ఓ క్యారెక్టర్ కోసం ఆదర్శ్ ని ఎంపిక చేసాడట జూనియర్. అయితే ఆదర్శ్ తాను ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లతో కలిసి దిగి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ వారితో కలిసి పనిచేయాలన్న తన కల నిజమైందని ట్వీట్ ద్వారా పేర్కొన్నాడు. అయితే ట్వీట్లో త్రివిక్రమ్ పేరు చివరన సార్ అని పెట్టిన ఆదర్శ్, ఎన్టీఆర్ పేరు పక్కన సార్ పెట్టకపోయే సరికి ఆగ్రహంగా ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు. అరవింద సమేత చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.