అశ్విన్ తాతా వస్తున్నాడు..శింబు లేటెస్ట్ టీజర్

Thu,February 9, 2017 04:59 PM
aaa movie Ashwin Thatha Preview Teaser released


చెన్నై: కోలీవుడ్ స్టార్ శింబు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఏఏఏ’ (అన్బనవన్ అసరధవన్ అడంగదవన్). అధిక్ రామచంద్రన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ప్రివ్యూ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. తాజా టీజర్‌లో శింబు అశ్విన్ తాతా వరార్ రోల్‌లో వృద్ధుడిగా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ఏఏఏ లో శింబు మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే మధుర మైఖేల్ పాత్ర (ఫస్ట్ రోల్) టీజర్‌ను రిలీజ్ చేసిన మూవీ టీం.. తాజాగా రెండవ పాత్ర అశ్విన్‌తాతా టీజర్‌ను విడుదల చేసింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో శింబుకి జోడీగా శ్రియా, తమన్నా నటిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్నందిస్తున్నాడు.

1945
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles