బన్నీ 19వ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడో తెలుసా ?

Tue,August 13, 2019 09:02 AM
AA19 Title will be unveiled on 15th August

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం త‌ర్వాత బ‌న్నీ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా, సంక్రాంతికి విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైంది. అయితే చిత్రానికి ఏ టైటిల్ పెడ‌తారోన‌ని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండగా, మేక‌ర్స్ అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఆగ‌స్ట్ 15న చిత్ర టైటిల్ రివీల్ చేయ‌బోతున్న‌ట్టు పేర్కొన్నారు. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో ఈ చిత్రం రూపొందుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ మూవీకి సంబంధించి ప‌లు టైటిల్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. చిత్రానికి ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారా అనే ఆస‌క్తి అభిమానుల‌లో మ‌రింత‌గా ఉంది. సుశాంత్, నివేదా పెతురాజ్‌, ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సంద‌డి చేయ‌నుండ‌గా, పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles