ఈ రోజు నుండి రెండో షెడ్యూల్‌.. టీంతో క‌ల‌వనున్న పూజా హెగ్డే

Wed,June 5, 2019 10:19 AM
AA19 second schedule started from today at Hyderabad.

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం త‌ర్వాత బ‌న్నీ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ‌ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇప్ప‌టికే పూర్తి చేసుకోగా, రెండో షెడ్యూల్ నేటి నుండి జ‌రుపుకోనుంది. తాజాగా చిత్ర యూనిట్ ముస్లిం సోద‌రుల‌కి రంజాన్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ నేటి నుండి రెండో షెడ్యూల్ మొద‌లు కానుంద‌ని తెలిపారు. ఈ షెడ్యూల్‌లో చిత్ర క‌థానాయిక పూజా హెగ్డే టీంతో క‌ల‌వ‌నుందట‌. దాదాపు 30 రోజుల పాటు ఈ చిత్ర షెడ్యూల్‌ని హైద‌రాబాద్‌లో జ‌ర‌పనున్న‌ట్టు తెలుస్తుంది. బ‌న్నీ- త్రివిక్ర‌మ్ కాంబినేషన్‌లో వ‌చ్చిన జులాయి, స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి చిత్రాలు సూప‌ర్ స‌క్సెస్ సాధించ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రోవైపు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ చేస్తున్న‌ ఐకాన్ సినిమాని త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఏక‌కాలంలో ఈ రెండు సినిమాల షూటింగ్ జ‌రిపి, వ‌చ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌ని అనుకుంటున్నార‌ట‌. త్రివిక్ర‌మ్ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుండ‌గా, ఐకాన్ చిత్రం స‌మ్మ‌ర్‌లో రిలీజ్ అవుతుంద‌ని అంటున్నారు.

2354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles