పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న బ‌న్నీ 19వ మూవీ

Sat,April 13, 2019 11:28 AM
AA 19 Pooja Ceremony

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బ‌న్నీ త‌న 19వ చిత్రంగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ఈ మూవీ గురించి ప్ర‌క‌టించి చాలా రోజులే అవుతున్న‌, ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌క‌పోయేస‌రికి అభిమానుల‌లో అనేక అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఏప్రిల్ 8న బ‌న్నీ పుట్టిన రోజుని పున‌స్క‌రించుకొని చిత్రాన్ని ఏప్రిల్ 24 నుండి సెట్స్ పైకి తీసుకెళుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్. ఇక కొద్ది సేప‌టి క్రితం ఈ మూవీకి సంబంధించి పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అల్లు అర్జున్‌, ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో పాటు అల్లు అరవింద్ ప‌లువురు ప్ర‌ముఖులు పూజా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. చిత్రంలో క‌థానాయిక‌గా పూజా హెగ్డే న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. త్రివిక్రమ్, బన్నీ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు బాక్సాపీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ రెండు చిత్రాల్లో తండ్రీ కొడుకుల అనుబంధాన్ని చక్కగా చూపించాడు త్రివిక్రమ్. తాజా చిత్రంలో కూడా తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని చూపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

1090
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles