షాపుల్లో స్టార్ దంప‌తుల కుమారుడి బొమ్మ‌లు

Tue,November 20, 2018 11:16 AM
A toy shop in Kerala sells Taimur dolls

కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్‌ల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ పుట్టినప్పటి నుంచీ తరచూ వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాడు. తన పేరుపై వివాదం దగ్గర నుంచి అతడు బయటకు వచ్చిన ప్ర‌తీసారి హాట్ టాపిక్ గా మారుతున్నాడు. సెలబ్రిటీ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్న తైమూర్‌ని చూసుకోవ‌డం కోసం రూ.1.75 లక్షలు ఇచ్చి మ‌రీ ఓ మ‌హిళ‌ని ఉద్యోగంలో పెట్టుకున్నార‌ట ఈ సెల‌బ్రిటీ క‌పుల్‌. తైమూర్‌కి ముంబైలోనే కాదు ఇత‌ర ప్రాంతాల‌లోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేప‌థ్యంలో కేరళలోని ఓ బొమ్మల దుకాణంలో తైమూర్‌ బొమ్మలు దర్శనిమవ్వ‌డం అంద‌రికి షాకింగ్‌గా మారింది. ఓ నెటిజ‌న్ షాపులోని తైమూర్ బొమ్మ‌ను ఫోటో తీసి ఇంట‌ర్నెట్‌లో షేర్ చేయ‌డంతో ఇది వైర‌ల్‌గా మారింది. ఇంత చిన్న వ‌య‌స్సులో అంత ఫాలోయింగ్ తైమూర్‌కి రావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఖంగు తింటున్నారు. బోర్డింగ్ స్కూల్‌లో వేసేందుకు తైమూర్‌ని త్వ‌ర‌లోనే విదేశాల‌కి పంప‌నున్నార‌ట సైఫ్ దంప‌తులు.


1791
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles